News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558439>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్నగర్లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 19, 2025
TU: డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యనభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1,2,3,4,5,6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చు అని వెల్లడించారు. జనవరి 3 లోపు ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News December 19, 2025
కడపలో వారి గన్ లైసెన్సుల రద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గన్ లైసెన్స్లపై దృష్టి సారించారు. లైసెన్స్ పొందిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిపై కేసుల వివరాలు, నేర చరిత్రను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 దాకా గన్ లైసెన్స్లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సమస్యలు సృష్టించే వారి గన్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.
News December 19, 2025
విజయవాడలో హత్యకు గురైన నర్సీపట్నం వాసి

నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన పలక తాతాజీ విజయవాడలో గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. అతని కుమారుడు శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనికి వెళ్లిన తాతాజీ ఇంటికి రాలేదు. స్నేహితులతో కలిసి గాలించగా చిట్టినగర్ స్వరంగం ప్రాంతం వద్ద రక్తపు మడుగుల్లో, కత్తిగాట్లుతో మృతి చెంది ఉన్నాడు. తండ్రి అనుమానాస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.


