News February 24, 2025
బాలానగర్: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

ఉరేసుకుని నర్సింగ్ <<15558486>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్నగర్లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 17, 2025
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ వంటి పశుగ్రాసాలను సాగుచేయాలి. అలాగే సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. ✍️మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 17, 2025
ఎయిర్ లైన్స్ మొదటి మహిళా CEO

ఎయిర్ ఇండియా తొలి మహిళా పైలట్ హర్ప్రీత్ ఒక ఎయిర్ లైన్స్కి మొదటి మహిళా CEOగా నిలిచి రికార్డు సృష్టించారు. 1988లో ఎయిర్ ఇండియాలో చేరిన హర్ప్రీత్ ‘ఎయిర్ ఇండియా’ సహాయక సంస్థ అయిన ‘అలయెన్స్ ఎయిర్’కి సీఈవోగా ఉన్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె ‘ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ’ నుంచి వాణిజ్య విమానాల పైలట్గా శిక్షణ పొందారు. విమానయానంలో కెరీర్ను ఎంచుకున్న మహిళలకు మార్గదర్శకంగా ఉంటున్నారు.
News November 17, 2025
డిసెంబర్లోనే లోకల్ బాడీ ఎన్నికలు.. లేదంటే!

TG: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను డిసెంబర్లో మొదలెట్టి జనవరి తొలి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరులో మేడారం జాతర, FEB 25 నుంచి ఇంటర్, MAR 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండటంతో అధికారులు వాటితో బిజీ కానున్నారు. దీంతో JANలోగా ఎలక్షన్స్ పెట్టకపోతే ఏప్రిల్ వరకు ఆగాల్సి రావొచ్చు. ఇవాళ క్యాబినెట్లో సాధ్యాసాధ్యాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.


