News March 3, 2025
బాలానగర్: భార్యను అవమానపరిచిన భర్త.. చివరికి.!

ఓ మహిళ వాగులో దూకి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. గుండెడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి (38) ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన లింగమయ్యతో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో భార్యను అవమానపరిచి నిందించాడు. అవమానం భరించలేక దుందుభి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 4, 2025
హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News March 4, 2025
MBNR: GET READY.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 22,483 మంది హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచాలన్నారు. 144 సెక్షన్ విధించాలన్నారు.
News March 4, 2025
భూత్పూర్: దివ్యాంగులకు కలెక్టర్ కీలక సూచన

MBNR జిల్లాలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు https://www.swavlambnacard.gov.in UDID వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాకలెక్టర్ విజయేంద్రబోయి సూచించారు. కలెక్టరేట్‌లో మీసేవ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. డేటా ఎంట్రీలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆమె ఆదేశించారు.