News February 7, 2025
బాలానగర్: విద్యార్థి మృతి.. కేసు నమోదు
బాలానగర్ మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థి ఆరాధ్య ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి గురువారం మధ్యాహ్నం విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థి తండ్రి కొమ్ము రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లెనిన్ గౌడ్ తెలిపారు.
Similar News
News February 7, 2025
నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరా స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన స్వామివారికి నేడు మొదటి రోజు అమ్మవార్ల ఊరేగింపు సేవ, 8న హంస వాహన సేవ, 9న ధ్వజ వాహన సేవ, 10న సూర్యప్రభ వాహన సేవ, 11న హనుమ వాహన సేవ,12న గరుడ వాహన సేవ,13న అశ్వవాహన సేవ,14న దర్బార్ సేవ,15న శేష వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News February 7, 2025
గద్వాల: ట్రాన్స్ జెండర్‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?
పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News February 7, 2025
MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా న్యూ <<1538043>>టౌన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి అతివేగంగా, ఆజాగ్రత్తగా బైక్ నడపడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.