News February 21, 2025
బాలానగర్: సీసీ కెమెరాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

బాలానగర్ సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో ఇటీవల సీసీటీవీల ప్రాముఖ్యత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ పరధిలోని ఆదర్శ్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను శుక్రవారం సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి, బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, బాలానగర్ ఏసీపీ హనుమంతా రావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
Similar News
News February 23, 2025
బయ్యారం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడులోని ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి, పిల్లలతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేసి వసతి గృహంలో అందుతున్న సేవలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో చదివి విద్యార్దులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలపాలని అన్నారు.
News February 23, 2025
సిద్దిపేట: గ్రామం నుంచి జాతీయ స్థాయికి

బహుజన సమాజ్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి కోఆర్డినేటర్‌గా ఎన్నికైన బెజ్జంకి మండల వాసి నిషాని రామ చంద్రంను శనివారం బెజ్జంకిలో మానకొండూర్ నియోజకవర్గ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. బాధ్యతలను అప్పగించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాతంగి తిరుపతి, మల్లయ్య, నిషాని రాజమల్లు, సుమలత, గుర్రం సత్యనారాయణ, రాజు, కనకం రఘు పాల్గొన్నారు.
News February 23, 2025
ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఇక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.