News September 17, 2024

బాలాపూర్ లడ్డూ స్పెషల్.. ఒక్కరే ఐదు సార్లు..!

image

HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాగా 1994లో ఈ వేలం ప్రారంభమవగా తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయనే 1995లో రూ. 4,500, 1998లో రూ.51,000, 2004లో రూ.2,01,000, 2008లో రూ.5,07,000 వేలం పాడి ఐదు సార్లు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత 30 ఏళ్లలో ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. SHARE IT

Similar News

News September 29, 2024

HYD: రూ.650 కోట్లతో కట్టుదిట్టంగా నాలా వ్యవస్థ

image

సీఎం రేవంత్ HYD నగరంలోని నాలాల వ్యవస్థను తక్షణమే సంస్కరించాలని నిర్ణయించారు.మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌తో ప్రత్యేక ప్రణాళికతో వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాలా పనుల కోసం రూ. 650 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అక్రమణల కారణంగా, నాలాల వెడల్పు 50 అడుగుల నుంచి 10 అడుగులకు చేరుకుంది. వీటిని తొలగించేందుకు హైడ్రాకు బాధ్యత అప్పగించనున్నారు.

News September 29, 2024

HYD: రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల రెక్కీ

image

HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.