News November 19, 2024
బాలాయపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
బాలాయపల్లి మండలానికి చెందిన అల్లం ఈశ్వరయ్య (60) అనే వ్యక్తిని ఆటో ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. గేదెలను వెతుక్కుంటూ గొల్లపల్లి వైపు వస్తుండగా వెంకటగిరి నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటో ఈశ్వరయ్యను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2024
నెల్లూరు జిల్లాలో విషాదం
పొట్టకూటి కోసం ఊరుగాని ఊరికి వచ్చి కానరాని లోకానికి చేరిన విషాద ఘటన డక్కిలి మండలం శ్రీపురంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామానికి చెందిన జంపాని వెంకటేశ్వరమ్మ వర్షంలో వరినాట్లు వేస్తుండగా పిడుగు పడి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్వరమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ, ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు.
News December 5, 2024
సోమశిల జలాశయానికి భారీ వరద
సోమశిల జలాశయంలో 71.451 టీఎంసీల నీటిమట్టం నమోదైనట్లు జలాశయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పెరుగుతూ 13,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యానికి మరో ఆరు టీఎంసీల నుంచి ఏడు టీఎంసీల వరకు కావలసి ఉంది. జలాశయం నుంచి కండలేరు వరద కాలువ ద్వారా కండలేరుకు 2000 క్యూసెక్కులు, స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు.
News December 4, 2024
అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ
అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.