News February 17, 2025

బాలికతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు: ఎస్‌ఐ

image

నూజివీడులో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై వరసకు అన్నదమ్ములు అయ్యే ఇద్దరు మైనర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిబాసు తెలిపారు. గత రాత్రి ట్యూషన్‌కు వెళ్తున్న బాలికపై ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారన్నారు. బాలిక వారి నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News March 21, 2025

గంగానమ్మ స్థలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి

image

నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్లో గంగానమ్మ రావిచెట్టు వద్ద ఓ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు శుక్రవారం ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అమెరికాలో MS చదివిన ఎడవల్లి రవిచంద్ర (30) అనే యువకుడికి మతిస్థిమితం లేదని స్థానికుల అంటున్నారు. శుక్రవారం గంగానమ్మను పెట్టి పూజిస్తున్న స్థలాన్ని గడ్డ పలుగుతో పగలగొడుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

News March 21, 2025

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 58,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

News March 21, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 37.9°C నమోదు కాగా, శంకరపట్నం 37.8, కరీంనగర్ రూరల్ 37.6, జమ్మికుంట 37.5, గన్నేరువరం 36.8, చొప్పదండి, మానకొండూర్ 36.6, రామడుగు 36.5, చిగురుమామిడి 36.4, వీణవంక 36.3, తిమ్మాపూర్ 36.1, కరీంనగర్ 36.0, కొత్తపల్లి 35.2, ఇల్లందకుంట 35.0, హుజూరాబాద్ 34.9, సైదాపూర్ 34.0°C గా నమోదైంది.

error: Content is protected !!