News October 27, 2024
బాలికను గర్భవతిని చేసిన యువకుడు అరెస్టు

ఇటీవల ఓ ఇంటర్ విద్యార్థిని గర్భవతిని చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు DSP కొండయ్యనాయుడు తెలిపారు. కురుబలకోట మండలానికి చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలికకు రాయచోటి మండలానికి ఖాదర్ బాషా(24) ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు. బాలిక గర్భం దాల్చింది. బాలిక తల్లి విషయం పసిగట్టి ముదివేడులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం కురబలకోట వద్ద అరెస్టు చేశారు.
Similar News
News January 2, 2026
చిత్తూరు: తగ్గిన రిజిస్ట్రేషన్లు

జనవరి 1న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. చిత్తూరు అర్బన్‌లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగకపోగా, చిత్తూరు రూరల్ పరిధిలో 4 మాత్రమే అయ్యాయి. సాధారణ రోజుల్లో రెండు కార్యాలయాల్లో కలిపి 30-50 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. పండగ నెల కావడంతో క్రయ, విక్రయదారులు లేకపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. జనవరి 1న సెలవుగా భావించి పలువురు రాలేదని అధికారులు చెప్పారు.
News January 2, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.
News January 2, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.


