News October 30, 2024
బాలికను పెళ్లి చేసుకుని వేధిస్తున్న భర్త.. పోక్సో కేసు నమోదు

విజయవాడలో ఓ మైనర్ బాలికను వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడలో ఉంటున్న 9వ తరగతి విద్యార్థిని(14)పై మేనమామ వరసైన సూరిబాబు మాయమాటలతో 2022లో అత్యాచారం చేయడంతో, పెద్దలు పెళ్లి చేశారు. 2ఏళ్లు గడవకముందే అత్తమామలు, భర్త వేధించడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలికకు 16ఏళ్లు కావడంతో గుణదల పోలీసులు పోక్సో, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


