News December 4, 2024

బాలికను మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు

image

బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన వ్యక్తిపై బంటుమిల్లి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దరిసే వెంకటేశ్వరస్వామి(23)కి బాలికతో(16)తో ఏడాది క్రితం పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకుని తల్లిని చేశాడు. నిన్న బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పెళ్లికి నిరాకరించడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదైంది.

Similar News

News January 16, 2025

కృష్ణా: అలర్ట్.. ఈనెల 17తో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో అక్టోబర్ 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈనెల 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది. 

News January 15, 2025

నందిగామలో దారుణ హత్య

image

నందిగామ మండలం ఐతవరంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఐతవరం గ్రామం బీసీ కాలనీలో చింతల నాగేంద్రమ్మ (33) అదే గ్రామానికి చెందిన తోగటి హనుమంతరావుతో ఏడాదిగా సహజీవనం చేస్తోంది. కాగా వీరు కొంతకాలంగా తరచుగా గొడవపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాగేంద్రమ్మను హనుమంతరావు హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 15, 2025

విజయవాడ: ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08533 VSKP- SC, నం.08537 VSKP- SC రైళ్లను బుధవారం నడుపుతామని, ఈ రైళ్లలో 9 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయన్నారు. నేడు నం.08533 రైలు మధ్యాహ్నం 3.30కి, నం.08537 రైలు రాత్రి 11.30కి విజయవాడ చేరుకుంటాయన్నారు.