News May 10, 2024
బాలికపై అత్యాచారం.. పొక్సో కేసు నమోదు

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పొక్సో కేసు నమోదైంది.
Similar News
News September 20, 2025
NLG: పండుగల వేళ.. ధరల షాక్

జిల్లాలో పండుగల ముందు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకు నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మొదలు కానుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతున్నది. పల్లీ నూనె రూ.190 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు KG రూ.220కు పైగానే ఉన్నది.
News September 20, 2025
NLG: లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశం

నల్గొండ డైట్లో చోటు చేసుకున్న విద్యార్థినికి లైంగిక వేధింపుల ఘటనపై DEO బొల్లారం బిక్షపతి విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎంఈఓ అరుంధతితోపాటు డైట్ ప్రిన్సిపల్ నరసింహను విచారణ అధికారులుగా నియమించామని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని.. విద్యార్థినికి న్యాయం చేస్తామని DEO తెలిపారు. విచారణ కమిటీలో అరుంధతిని తొలగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
News September 20, 2025
గట్టుప్పల్: చేనేత కార్మికురాలి ఆత్మహత్య

అప్పుల బాధలు తట్టుకోలేక గట్టుప్పల్‌కు చెందిన చేనేత కార్మికురాలు అప్పం యాదమ్మ (50) ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆమె, బాత్రూంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.