News April 30, 2024
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

రంగారెడ్డి జిల్లా లోయపల్లికి చెందిన బూడిద బాలనర్సయ్య 2016లో నల్గొండ జిల్లాకు చెందిన మతిస్థిమితంలేని ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మెడలో బలవంతంగా తాళికట్టి పెళ్లి అయినట్లు నమ్మించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 9వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000జరిమానా విధించింది.
Similar News
News October 21, 2025
తెరుచుకోని కేంద్రాలు.. గ్రామాల్లో దళారుల తిష్ట

దళారులు చేతిలో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. ఇప్పటికే పత్తి మొదటి దశ పత్తి ఏరడం పూర్తయి రెండో దశ కూడా ఏరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేటికీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలను ప్రారంభించనున్నారు.
News October 20, 2025
జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రేపు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘స్మృతి పరేడ్’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, అమరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.