News September 21, 2024

బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు

image

బాలిక అత్యాచారానికి గురైన కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు, రూ.50వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు. పీపీ కె.శ్యామల కథనం ప్రకారం చాకలి గుంటకు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని బాణావత్ గోపి నాయక్ అత్యాచారం చేశాడు. పెళ్లి కోసం ఇంటి నుంచి పరారైన బాలికను షేక్ మహమ్మద్ రఫీ అనే ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.

Similar News

News October 10, 2024

ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ ఆరోగ్య మిషన్ గుంటూరు విభాగంలో ఉద్యోగాల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి విజయలక్ష్మి బుధవారం తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటరీ అటెండర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను DMHO కార్యాలయంలో అందజేయాల్సిందిగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.inలో చూడాలన్నారు.

News October 10, 2024

ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.

News October 10, 2024

గుంటూరులో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం పర్యటన

image

కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన సాధారణ పర్యవేక్షణ 2024-2025 సంవత్సరానికి(దశ-1) నిర్వహించటానికి జాతీయస్థాయి పర్యవేక్షకులు బుధవారం గుంటూరు జిల్లాకు విచ్చేశారు. ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సూర్యకాంత, కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు. అనంతరం కలెక్టర్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.