News June 28, 2024
బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల జైలుశిక్ష
చిత్తూరు: బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. గుడిపల్లె మండలానికి చెందిన 9వ తరగతి బాలికకు దేవరాజ్(26) మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2014 జూలై 5న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో దేవరాజ్‌కు 24 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి శాంతి తీర్పు చెప్పారు.
Similar News
News December 12, 2024
CTR: 23 ఉద్యోగాలకు దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.
News December 12, 2024
శ్రీవారి పాదాల మార్గం మూత
తిరుమలలో భారీ వర్షాల కురుస్తోన్న నేపథ్యంలో TTD అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి వారి ఆలయం మార్గంతో పాటు శ్రీవారి పాదాల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిని తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News December 12, 2024
తిరుపతి జిల్లాలోనూ సెలవు
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.