News January 24, 2025
బాలికలు ఉన్నత రంగాల్లో రాణించాలి: ఖమ్మం కలెక్టర్
బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై సంతకం చేశారు. బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.
Similar News
News January 27, 2025
కామేపల్లి మాజీ సర్పంచ్‌కు అవార్డు
ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పీఎం మత్స్య సంపద పథకం లబ్ధిదారుడు, కామేపల్లి పెద్దచెరువు మత్స్యశాఖ సొసైటీ సభ్యుడు అజ్మీర రాందాస్ నాయక్ పాల్గొన్నారు. కామేపల్లికి చెందిన రాందాస్ నాయక్ అతని సతీమణి చిన్ని పరేడ్లో పాల్గొననున్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద నిర్వహించిన వేడుకల్లో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ కదిరి అహ్మద్ రాందాస్ నాయక్‌కు అవార్డును అందజేశారు.
News January 27, 2025
కల్లూరులో సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి
కల్లూరుకి చెందిన ఇల్లూరి నాగాచారి(45) సాగర్ కాలువలో పడి మృతిచెందారు. పోలీసుల వివరాలిలా.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కల్లూరు పాత బస్టాండ్ వద్ద ప్రమాదవశాత్తు సాగర్ నాగాచారి కాలువలో పడ్డారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలింపు చేపట్టగా ఆదివారం సాయంత్రం రఘునాథ బంజర వద్ద అతని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 27, 2025
KMM: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం ఖానాపూర్‌లో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. అటు పెండింగ్లో ఉన్న రుణమాఫీ సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు.