News August 15, 2024
బాలికల కిడ్నాప్ కేసులో ఇద్దరికి రిమాండ్

గుంటూరు పట్టాభిపురం పోలీసులు కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. జూట్ మిల్లు సమీపంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఉంటున్నారు. బాలికను, ఆమె స్నేహితురాలిని తీసుకెళ్లిన కేసులో నిందితులుగా ఉన్న గోపి, మణికంఠలను పట్టాభిపురం సీఐ కిరణ్ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
Similar News
News October 18, 2025
లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి: కలెక్టర్

PC PNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అల్ట్రా సౌండ్ క్లినిక్‌లు కలిగిన నర్సింగ్ హోమ్‌లు, ఇమేజింగ్ కేంద్రాలు, జెనెటిక్ మొబైల్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, సరోగసి క్లినిక్‌లు తదితర సంస్థలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News October 18, 2025
గుంటూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు

గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం శనివారం దాడులు నిర్వహించింది. పాత గుంటూరు PS పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని అదుపులోకి తీసుకుని, 10 సెల్ ఫోన్లు, ₹25,500 నగదు, 4 బైకులను సీజ్ చేశారు. అలాగే, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్మూలించడమే టాస్క్ ఫోర్స్ లక్ష్యమని ఎస్పీ అన్నారు.
News October 18, 2025
సూర్యఘర్ పథకం వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. SC, STలకు ఉచితంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.