News March 11, 2025
బాలిక చేయ్యి పట్టుకొని దాడి.. నిందితుడికి జైలు: ఎస్పీ

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి జైలు శిక్ష పడినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2018 జనవరిలో చేగుంట మండలం చిట్టోజిపల్లికి చెందిన చల్మెడ సురేశ్.. ఓ బాలిక చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి, కొట్టి అవమానించాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదు కాగా విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద నిందితుడికి 5 ఏళ్ల జెలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు SP చెప్పారు.
Similar News
News March 21, 2025
బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి: ఎస్పీ

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడొద్దని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి, డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన అట్టి వ్యక్తులపై చట్టారీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News March 21, 2025
మెదక్: అంతరిస్తున్న అడవులు..!

జీవకోటికి ప్రాణవాయువు అందించేది అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అడవి తగ్గడంతో పర్యావరణానికి ముంపు ముంచుకొస్తోంది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం 6.,89,342 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 6,865 ఎకరాల భూమి అక్రమనకు గురికావడంతో జీవరాసులకు మనుగడ లేకుండా పోతుందని అటవీ సిబ్బంది అధికారులు చెబుతున్నారు.
News March 21, 2025
మెదక్: 10338 మందికి 68 సెంటర్లు

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.