News November 30, 2024

బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 15, 2025

ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

image

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

News October 15, 2025

ఒంగోలులో వ్యక్తి మిస్సింగ్.. ఎక్కడైనా చూశారా..!

image

ఒంగోలు పరిధిలోని శ్రీనగర్ కాలనీ ఒకటవ లైన్‌లో ఉండే భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి (దేవుడు) ఆదివారం మిస్ అయినట్లు ఒంగోలు తాలూకా PSలో ఫిర్యాదు అందింది. మిస్ అయిన వ్యక్తి భార్య వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో స్థిరపడ్డారు. కాగా ఆదివారం బ్యాంక్‌లో క్రాఫ్‌లోన్ కట్టేందుకు స్వగ్రామానికి వెళ్లున్నానని వెళ్లాడన్నారు. వివరాలు తెలిస్తే 9177688912కు కాల్ చేయాలన్నారు.

News October 15, 2025

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అంటే జాగ్రత్త.!

image

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశాలు ఎక్కువ అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే మంగళవారం ఓ ప్రకటనను పోలీసులు విడుదల చేశారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలు వస్తాయని వచ్చే మెసేజ్లపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.