News November 30, 2024

బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 3, 2024

ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం SP

image

సమాజంలోని సామాన్య ప్రజలు, వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను పోలీసు ఉన్నదాధికారులు స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

News December 2, 2024

ప్రకాశం: ‘ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’

image

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

News December 2, 2024

ప్రకాశం జిల్లాలో 16,280 మంది HIV రోగులు

image

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా ప్రకాశం జిల్లాలో 16,280, బాపట్ల జిల్లాలో 11,356 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. ఇక AP ART సెంటర్ల ద్వారా 2.24లక్షల మంది చికిత్స పొందుతున్నారు.