News September 17, 2024

బాలినేని దారెటు?

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎపిసోడ్ పలు మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇక ఓటమి తర్వాత ఒంగోలులో రీ వెరిఫికేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద చర్చే జరిగింది. దీంతో ఆయన దారెటు అంటూ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Similar News

News October 3, 2024

చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి

image

చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.

News October 3, 2024

ఒంగోలులో సందడి చేయనున్న కీర్తి సురేశ్

image

ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

News October 3, 2024

ఒంగోలు: నేటి నుంచి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

image

ఒంగోలులోని కొండమీద వెలసిన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.