News September 13, 2024
బాలినేని పార్టీ మార్పుపై మరోసారి చర్చ
మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్‌లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 4, 2024
ప్రకాశం: అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు
ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.
News October 4, 2024
ప్రకాశం: అక్రమ రవాణాపై దృష్టి సారించండి: కలెక్టర్
జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మైనింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు.
News October 3, 2024
చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి
చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.