News October 2, 2024
బాలినేని సైలెంట్కు కారణం అదేనా..?

ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జనసేన గూటికి చేరిన తర్వాత ఒంగోలుకు వచ్చిన బాలినేనికి ఆ పార్టీ నాయకులు కలిసి మద్దతు పలికారు. జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని బాలినేని అప్పుడు ప్రకటించినా.. సైలెంట్ అయ్యారు. పవన్ దీక్షలో ఉండటంతోనే బాలినేని సైలెంట్ అయ్యారని.. తెర వెనుక పక్కా ప్లాన్తో చేరికలపై అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.
Similar News
News November 25, 2025
ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!

కొరిశపాడు: ATMలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న 2 ATMలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ATMలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి కొరిశపాడు(M) రావినూతల గ్రామానికి చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.