News February 8, 2025

బాలుడి మర్మాంగాన్ని కొరికిన కుక్క..!

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుంట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తుండగా వారు పెంచుకునే కుక్క మర్మాంగాన్ని కొరికింది. కుటుంబీకులు బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడి మర్మాంగానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామకృష్ణ తెలిపారు.

Similar News

News February 8, 2025

SA20: సన్ రైజర్స్ హ్యాట్రిక్ కొడుతుందా?

image

సౌతాఫ్రికా లీగ్ 20 తుది అంకానికి చేరింది. కావ్య మారన్‌కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ నేడు టైటిల్ కోసం తలపడనున్నాయి. రషీద్ సారథ్యంలోని కేప్ టౌన్ టైటిల్‌పై కన్నేయగా ఈస్టర్న్ కేప్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో పాటు డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.

News February 8, 2025

MP మాగుంటకు మరో కీలక పదవి

image

జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) మెంబెర్‌గా ఒంగోలు MPమాగుంట శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ మాగుంట ఇప్పటికే కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల శాఖ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

News February 8, 2025

కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్

image

ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.

error: Content is protected !!