News July 18, 2024
బాలుడి మృతి.. జవహర్‌నగర్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. 18 నెలల బాలుడు విహాన్ కుక్కల దాడిలో మరణించిన నేపథ్యంలో జవహర్‌నగర్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు సూచనలు చేశారు.
Similar News
News September 16, 2025
రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్‌లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
News September 16, 2025
HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.
News September 16, 2025
MGBS మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

దేశంలోనే పాస్‌పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.