News March 5, 2025

బాలుడి వేదనకు స్పందించిన వనపర్తి ఎస్పీ

image

ఇబ్బందుల్లో ఉన్న బాలుడిని పోలీసు హృదయం ప్రేమతో ఆదరించి అక్కున చేర్చుకున్న ఘటన వనపర్తిలో జరిగింది. పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన గొల్ల నరసింహ, వనిత కొడుకు(9)ను(వనిత మృతి) సవతి తల్లి ఇబ్బందులకు గురి చేసేంది. దీంతో బాలుడు ఆ బాధలు భరించలేక బంధువుల సాయంతో జిల్లా ఎస్పీ గిరిధర్‌ని కలిశాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ బాలుడిని చేరదీసి భద్రతకు భరోసా కల్పించారు. ఏదైనా పాఠశాలలో చేర్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Similar News

News February 9, 2026

జెమినీ, చాట్‌GPTకి దీటుగా మన ‘సర్వం ఏఐ’!

image

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్‌GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్‌GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్‌ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

News February 9, 2026

సర్వం ఏఐ.. ఇంతకీ ఏంటిది?

image

సర్వం ఏఐ కంపెనీని 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. హైఎండ్ క్లౌడ్ కంప్యూటర్ల కోసమే కాకుండా ఫోన్లు, స్థానిక భాషల కోసం దీన్ని రూపొందించారు. భారత భాషల్లోని క్లిష్టమైన డాక్యుమెంట్లనూ Sarvam Vision ఈజీగా చదివేస్తోంది. text-to-speech టూల్ ‘Bulbul’ 11 భారత భాషల్లో 32 వాయిస్‌లు అందిస్తోంది. చౌకగా, స్థానిక భాషలతో, స్క్రిప్టులను చదవడంలో మేలైన OCRతో ఇక్కడి సంస్థలను సర్వం ఏఐ ఆకర్షిస్తోంది.

News February 9, 2026

కరీంనగర్: పదవి కోసం అభ్యర్థుల తంటాలు

image

ఉమ్మడి KNR జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పలు డివిజన్ల, వార్డుల్లో ఎక్కువ మంది పోటీలో ఉండటంతో, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు, ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.