News February 10, 2025
బాల్కొండ: కాలువలో వ్యక్తి గల్లంతు.. వివరాలు ఇవే!

బాల్కొండ మండలం బుస్సాపూర్లోని ఇందిరమ్మ కాలువలో పడి <<152100>>వ్యక్తి<<>> గల్లంతయిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బీర్ సింగ్ మారాబి(40) బస్సాపూర్లో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం తన ఫోన్ రిపేర్ చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం నీటిని నిలిపివేశారు.
Similar News
News November 13, 2025
నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న షీ టీమ్స్

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.
News November 13, 2025
NZB: నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీల నియామకం

తెలంగాణ జాగృతి విస్తరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీలను కవిత ప్రకటించారు. ఈ మేరకు అర్బన్ కమిటీ సభ్యులుగా కరిపే రాజు, యెండల ప్రసాద్, రెహన్ అహ్మద్, ఇరుమల శంకర్, పంచరెడ్డి మురళీ, అంబాటి శ్రీనివాస్ గౌడ్, సాయికృష్ణ నేత, షానావాజ్ ఖాన్, రూరల్ నరేష్ నాయక్, బాణోత్ ప్రేమ్ దాస్, ఆర్మూర్ నుంచి ఏలేటి నవీన్ రెడ్డి, మనోజ్ రావు, ఆజమ్, బాల్కొండకు మహేందర్ రెడ్డి, ధీరజ్లను నియమించారు.
News November 13, 2025
ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై NZB కలెక్టర్ సమీక్ష

NZB కలెక్టరేట్లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి MPDOలు, హౌసింగ్ AEలు, MPOలు, GP కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణాల్లో వెనుకంజలో ఉన్న వివిధ మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు.


