News December 21, 2024
బాల్యం అంటేనే ఒక మధుర స్మృతి: ఎంపీ కావ్య
జఫర్గడ్ మండలం కునూరు గ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులందరూ కలిసి నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వరంగల్ కడియం కావ్య హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. బాల్యం అంటేనే ఓ మధుర స్మృతి అని, ఏ పాఠశాలకైనా విద్యార్థులే పునాది అని, మనకు చదువు నేర్పిన పాఠశాలకు మనం ఎదో ఒకటి చేయాలన్నారు.
Similar News
News December 22, 2024
వరంగల్: భర్త కూర బాగాలేదన్నడని భార్య ఆత్మహత్యాయత్నం
భర్త కూర మంచిగా లేదు అన్నందుకు ఓ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ స్టేషన్ రోడ్ సమీపంలో నివాసముండే సర్వారి స్వర్ణముఖి తన భర్త కూర బాగా లేదన్నాడని ఆత్మహత్యకు యత్నించింది. టార్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు.
News December 22, 2024
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీతక్క
విజయవాడ కనకదుర్గా అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. స్థానిక నేతలు ఉన్నారు.
News December 22, 2024
వరంగల్ భద్రకాళి అమ్మవారి అలంకరణ
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో నేడు ఆదివారం ఆలయ అర్చకులు శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.