News February 19, 2025
బాల్యవివాహాలు రూపుమాపాలి: కలెక్టర్

మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని, పిల్లల సంక్షేమమే ధ్యేయంగా కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో బాల్యవివాహాలను రూపుమాపాలన్నారు. దీనిపై మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మిషన్ వాత్సల్య కార్యక్రమంపై జిల్లా స్థాయి బాలల సంక్షేమం పరిరక్షణ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News November 23, 2025
సముద్రంలో దిగి కోనసీమ బాలుడి గల్లంతు

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తెన్నేటి మహిమరాజు (14) ఆదివారం సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. మలికిపురం ఎస్ఐ సురేష్ వివరాల మేరకు.. బాలుడు ముగ్గురు స్నేహితులతో కలిసి మలికిపురం మండలం చింతలమోరి బీచ్లో స్నానానికి దిగాడు. కెరటాలకు సముద్రంలో కొట్టుకు పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
NGKL: వృద్ధురాలితో భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజకు మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు పేరుతో ఇల్లు మంజూరు చేశారు. ఆయన భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. లక్ష్మిదేవమ్మ భూమిపూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువు అని స్థానికులు చెప్పారు. ఇలాంటి సాంఘిక దురాచారాలు నమ్మడం మంచిది కాదని ఆమెతో మంత్రి పూజ చేయించారు.
News November 23, 2025
అనకాపల్లి: ఈనెల 24 నుంచి రైతు వారోత్సవాలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి 29 వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు
అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి ఆదివారం తెలిపారు. దీని ద్వారా ప్రతి రైతు ఇంటికి వెళ్లి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రతి 3 రైతు కుటుంబాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి రోజుకి 30 క్లస్టర్ల (90 కుటుంబాలు)కు చెందిన రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.


