News March 19, 2025
బాల్యాన్ని గుర్తుచేసిన ఆటల పోటీలు: హోం మంత్రి అనిత

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి ఆటల పోటీల్లో పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఉల్లాసవంతమైన వాతావరణంలో అందరితో కలిసి కాసేపు సరదాగా గడిపినట్లు తెలిపారు. స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు బాల్యాన్ని గుర్తు చేశాయని అన్నారు.
Similar News
News April 17, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి: మాజీ మంత్రి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
News April 17, 2025
ఈసారి ఐపీఎల్ టైటిల్ RCBదే: విలియమ్సన్

ఐపీఎల్-2025 విజేత ఎవరనేది న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ప్రిడిక్ట్ చేశారు. ఆర్సీబీ జట్టు ఈసారి కచ్చితంగా కప్ గెలుస్తుందన్నారు. ‘విరాట్ కోహ్లీ ప్రతి సీజన్‌లో అద్భుతంగా ఆడారు. ఈ ఏడాది కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తున్నారు. గేమ్ పట్ల హంగర్, ప్యాషన్ ఏమాత్రం తగ్గలేదు. ఆర్సీబీకి కప్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది ఆ కల నెరవేరుతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి మీరేమంటారు? COMMENT
News April 17, 2025
సిజేరియన్ డెలివరీలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

కోఠిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవిలో గర్భిణులు, బాలింతల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.