News April 16, 2025

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: జిల్లా కలెక్టర్

image

పాఠశాలల్లో 10వ తరగతి చదువు పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోయే 18ఏళ్ళ లోపు బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలను గ్రామ స్థాయిలోనే గుర్తించాలని, పరిష్కరించలేని సమస్యలను తన దృష్టికి తీసుకు రావాలన్నారు. గ్రామ, మండల, డివిజనల్ స్థాయిలో సమర్థంగా పని చేయాలన్నారు.

Similar News

News December 5, 2025

నర్సంపేట: భారీ పోలీస్ బందోబస్తు నడుమ CM పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు నర్సంపేటకు రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 575 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో డీసీపీలతో పాటు, ఏసీపీలు, సీఐలు, ఎస్సై, ఆర్ఐ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్, ట్రాఫిక్ పోలీసులు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డ్స్ ఉన్నారు.

News December 5, 2025

రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

image

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 5, 2025

రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

image

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.