News March 3, 2025

బాల్య వివాహ రహిత సమాజం కోసం కృషి: కలెక్టర్

image

బాల్య వివాహ ర‌హిత స‌మాజం కోసం స‌మ‌ష్టిగా కృషి చేయాల్సిన అవ‌స‌ర‌ం ఉందని.. బాల్య వివాహాల దుష్ప‌రిణామాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. సోమవారం విజ‌య‌వాడలో చిల్డ్ర‌న్ హోం ప్రాంగ‌ణంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వ‌హించిన కొవ్వొత్తుల ర్యాలీలో క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా సిగ్నేచ‌ర్ క్యాంప‌యిన్‌ను ప్రారంభించారు. 

Similar News

News November 7, 2025

హనుమాన్ చాలీసా భావం – 2

image

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
ఇది ఆంజనేయుడి గొప్పదనాన్ని వివరిస్తుంది. హనుమాన్ రాముడికి నమ్మకమైన దూత(రామదూత). ఆయన బలం కొలవలేనిది, అపార శక్తిమంతుడు(అతులిత బలధామా). ఆయన అంజనీదేవి కుమారుడు(అంజనిపుత్ర), వాయుదేవుని పుత్రుడు(పవనసుత). శ్రీరాముడి విజయం, ధర్మ స్థాపనలో హనుమంతుని పాత్ర కీలకం. ఆయనను స్మరిస్తే శక్తి, విజయం లభిస్తాయి. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 7, 2025

ఇళయరాజా కచేరీకి పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ కోసం సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఏసీపీ దామోదర్‌ను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షరీనా బేగం పాల్గొన్నారు.

News November 7, 2025

ములుగు జిల్లాకు ఎంపీఓల కేటాయింపు

image

ములుగు జిల్లాకు ముగ్గురు నూతన మండల పంచాయతీ అధికారుల(ఎంపీఓ)ను ఉన్నతాధికారులు కేటాయించారు. ఏటూరునాగారం ఎంపీఓగా పి.వినయ్, తాడ్వాయికి జి.మహేందర్, నూగురు వెంకటాపురానికి జి.జమ్మిలాల్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం నూతన ఎంపీఓలు కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-2 అధికారులు జిల్లాకు ఎంపీఓగా రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.