News March 3, 2025
బాల్య వివాహ రహిత సమాజం కోసం కృషి: కలెక్టర్

బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని.. బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సోమవారం విజయవాడలో చిల్డ్రన్ హోం ప్రాంగణంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపయిన్‌ను ప్రారంభించారు.
Similar News
News March 23, 2025
సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు. సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 23, 2025
నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.
News March 23, 2025
ఆదిలాబాద్: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.