News February 21, 2025

బావుసాయిపేటలో మృతదేహంతో ఆందోళన

image

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బత్తుల రేన (22) అనే వివాహిత బతుకుతెరువు కోసం వేములవాడ రూరల్ మండలం నాంపల్లిలో ఉంటుంది. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా భర్త మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వీరిద్దరి మృతికి కారకుడు అంటూ బావుసాయిపేట గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఇంటి ముందు రేనా మృతదేహంతో ఆందోళన దిగారు.

Similar News

News October 22, 2025

అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్

image

నిన్న ఓ వెబ్‌సైట్‌పై <<18065234>>ఫైరయిన<<>> ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.

News October 22, 2025

వరంగల్ మార్కెట్ లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,000 ధర పలకింది. వండర్ హాట్(WH) మిర్చి రూ.16, 500, తేజా మిర్చి ధర రూ.14,400గా ఉంది. జాతీయ మార్కెట్‌లో మిర్చికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.

News October 22, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల జాబితా.!

image

అమరావతి-అమరేశ్వరస్వామి దేవాలయం.
కోటప్పకొండ-శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.
పెదకాకాని-శ్రీ మల్లేశ్వరస్వామి.
బాపట్ల-సోమనాథేశ్వరస్వామి ఆలయం.
చీరాల-శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం.
మాచర్ల-కాళహస్తేశ్వరస్వామి.
గురజాల-వీరేశ్వరస్వామి.
సత్తెనపల్లి-పాండురంగేశ్వరస్వామి.
చేబ్రోలు-చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి.
గోవాడ-శ్రీ బాల కోటేశ్వరస్వామి.
చిలుమూరు-శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయం.
గుంటూరు-సాంబశివాలయం.