News February 2, 2025

బాసరకు పోటెత్తిన భక్తులు

image

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే వసంత పంచమి వేడుకలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సాధారణ సెలవు దినం కావడం ఉత్సవాల ప్రత్యేక దినం కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అక్షర శ్రీకర పూజలు ప్రారంభిస్తున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ఆలయంలో మూడు మండపాల్లో పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News October 17, 2025

ప్రత్యేక కార్యాచరణతో విజయోస్తు 2.0: కలెక్టర్

image

జనగామ జిల్లా విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, అన్ని అంశాల్లో రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో జిల్లా నిలబడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్య శాఖ అధికారి పింకేష్ కుమార్‌తో కలిసి విజయోస్తు 2.0, పదవ తరగతి పరీక్షలు, డిజిటల్ లర్నింగ్ కరిక్యులం, లైబ్రరీ, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో రివ్యూ నిర్వహించారు.

News October 17, 2025

ధర్మపురి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

ధర్మపురి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో గల ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ, డీఈఓ, తహశీల్దార్ తదితరులున్నారు.

News October 17, 2025

జనగామ: వ్యవసాయ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవులు

image

జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 19 నుంచి 23 వరకు సెలవులు ఉంటాయని మార్కెట్ కమిటీ ఛైర్మన్ భానుక శివరాజ్ యాదవ్ తెలిపారు. దీపావళి ఆనవాయితీ ప్రకారం ఈనెల 22, 23వ తేదీల్లో కేదారేశ్వర వ్రతాల సెలవులు కాగా.. 19న సాధారణ సెలవు, 20న దీపావళి, 21న అమావాస్య సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి 24న మార్కెట్ పునః ప్రారంభం అవుతుందన్నారు.