News January 23, 2025
బాసరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అతిథి గృహంలో బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు ఆర్డీఓ కోమల్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చేనెల ఫిబ్రవరి 1నుండి 3వ తేదీ వరకు జరిగే వసంత పంచమి మహోత్సవాలకు సంబంధించి చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెరుగైన సౌకర్యాలను అందించాలన్నారు.
Similar News
News December 7, 2025
నా పెళ్లి క్యాన్సిల్ అయింది: స్మృతి

తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్రికెటర్ <<18479493>>స్మృతి<<>> మంధాన ప్రకటించారు. ‘గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ మ్యాటర్ను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే చేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం’ అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
News December 7, 2025
ఉప్పల్లో మెస్సీ మ్యాచ్కు పకడ్బందీ ఏర్పాట్లు

TG: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ-CM రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ <<18413680>>మ్యాచ్<<>> ఆడనున్న విషయం తెలిసిందే. దీనిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు రానున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయానికి ముందే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.
News December 7, 2025
₹500 కోట్లు ఇచ్చినోళ్లు సీఎం అవుతారు: సిద్ధూ భార్య

₹500 కోట్లు ఇచ్చిన వాళ్లు CM అవుతారని నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూను CM అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పారు. ‘పంజాబ్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. అవకాశం ఇస్తే పంజాబ్ను బంగారు రాష్ట్రంగా మారుస్తాం. CM కుర్చీ కోసం ఇచ్చేందుకు మా దగ్గర ₹500 కోట్లు లేవు’ అని చెప్పారు. అయితే తమను ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదన్నారు.


