News April 4, 2025

బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

image

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 5, 2025

శిల్పకళా సంపద అద్భుతం: వరంగల్ సీపీ

image

కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు కోటను శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తిలకించారు. కళాఖండాలను, వాటి చరిత్రను పర్యాటకశాఖ గైడ్ రవి యాదవ్ వారికి వివరించారు. కళా తోరణాల మధ్యలో ఉన్న శిల్పకళా సంపదను చూసి అద్భుతం అని కొనియాడారు. కుష్మహల్, ఏకశిల కొండ, స్వయంభు దేవాలయం, శృంగారపు బావి, అనంతరం సౌండ్ అండ్ లైట్‌షో తిలకించారు.

News April 5, 2025

వరంగల్ వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను వరంగల్‌ జిల్లాలోని MPDO ఆఫీసులలో ఇవ్వాలి. SHARE

News April 5, 2025

వరంగల్‌లో సన్నబియ్యం పంపిణీ.. BJP, కాంగ్రెస్ వార్

image

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బియ్యం మేమిస్తున్నామంటే మేమిస్తున్నామని ఓరుగల్లు BJP, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నెలకొంది. కేంద్రం 5KGలు, రాష్ట్ర ప్రభుత్వం 1KG మాత్రమే ఇస్తుందని BJPనేతలు అంటుంటే.. మొత్తం రాష్ట్రప్రభుత్వమే భరిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని BJP నాయకులు ప్రశ్నిస్తున్నారు.

error: Content is protected !!