News April 4, 2025
బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 28, 2025
డిప్లొమా దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ శంకర్

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల దరఖాస్తు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. రెండేళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయన్నారు. బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tspmb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 28, 2025
మొంథా తుఫాన్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.
News October 28, 2025
ఖమ్మం: రూ.2.6 లక్షలతో జర్మనీలో ఉద్యోగాలు

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ITI క్యాంపస్‌లోని మోడల్ కెరీర్ సెంటర్లో ఈనెల 30న జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరగనుందని జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న, 19-30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఎంపికైన వారికి నెలకు రూ.2.6 లక్షల వేతనం ఉంటుందన్నారు.


