News January 30, 2025
బాసరలో 2 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఫిబ్రవరి 2, 3వ తేదీన అక్షరాభ్యాసాలు మినహా ఆర్జిత సేవలు రెండు రోజులు రద్దు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహణాధికారి తెలిపారు. అక్షరాభ్యాసాలు మినహా రుద్రాభిషేకం, కుంకుమార్చన, వాహనపూజలు, వేదశీర్వచనం, సత్యనారాయణ పూజ, చండీహోమం నిర్వహించబడవని పేర్కొన్నారు. వసంత పంచమి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News November 27, 2025
BREAKING: ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ను పట్టుకున్న ACB

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, అతని డ్రైవర్ భూమేష్ (ప్రైవేట్ వ్యక్తి)ని గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు విషయంలో కమిషనర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ ఇంటి వద్ద డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. డ్రైవర్ బ్యాగును తనిఖీ చేయగా అందులో అదనంగా రూ.4.30 లక్షలు లెక్కల్లో చూపని నగదు దొరికింది.
News November 27, 2025
విశాఖ: రూ.1,12,03,480 ప్రాపర్టీ రికవరీ

విశాఖ సీపీ కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. అక్టోబర్ నెలలో జరిగిన రికవరీ మేళాలో విశాఖ కమీషనరేట్ పరిధిలో నమోదైన కేసులను పోలీసులు చేధించి రూ.1,12,03,480 సొత్తును రికవరీ చేశారు. ఆ ప్రాపర్టీను సీపీ శంఖబ్రత బాగ్చి బాధితులకు అందించారు. మొత్తం 838.331 గ్రాముల బంగారం, 505 మొబైల్ ఫోన్స్, 22 ద్విచక్ర వాహనాలు, రూ.3,10,500 రికవరీ చేశారు. విశాఖ సీపీ ప్రతి నెల ఈ మేళా నిర్వస్తున్నారు.
News November 27, 2025
వరంగల్: పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

సెప్టెంబర్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తోపాటు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో అత్యధిక కేసులను రాజీమార్గంలో ముగించినందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు అభినందించారు. ఈ మేరకు ఆయన చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.


