News October 13, 2024
బాసర అమ్మవారికి దిల్‌రాజు పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.
Similar News
News November 8, 2024
NZB: నిర్ణీత గడువులోపు సర్వేను పూర్తి చేయాలి
ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ సూచించారు. స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశమై ఇంటింటి సర్వే ప్రగతిని సమీక్షించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అధికారులు పాల్గొన్నారు.
News November 7, 2024
బాన్సువాడ కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి
ప్రభుత్వ జూనియర్ కళాశాల బాన్సువాడ(co-ed)లో ఇవాళ సాయంత్రం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు ఇజాజుద్దీన్, దాసరి శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. అదే విధంగా పరీక్షల వరకు విద్యార్థులను కష్టపడి చదివించాలని సూచించారు.
News November 7, 2024
370 కేంద్రాల్లో ధాన్యం సేకరణ: NZB కలెక్టర్
ప్రస్తుతం 370 కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 673 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. వాటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 439 కేంద్రాలను, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్ల కోసం 234 కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.