News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్‌టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.
News November 25, 2025
కడప జిల్లా హెడ్ క్వార్టర్‌కు ప్రొద్దుటూరు సీఐ..!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్‌కి పంపినట్లు సమాచారం.
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.


