News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
పిట్లం: తండ్రికి కల్లులో విషం.. కొడుకు ఘాతుకం..!

వృద్ధుడైన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన ఆ కొడుకు.. తండ్రి తాగే కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం(M) గౌరారం తండాలో శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI వెంకట్రావ్ ప్రకారం.. తండావాసి దశరథ్ కొడుకు వామన్ వద్దుంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడు. కేసు నమోదు చేసి, నిందితుడైన వామన్ను ఆదివారం రిమాండ్కు తరలించారు
News October 27, 2025
వరంగల్: నేడు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభిస్తున్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 గా నిర్ణయించింది. రైతులు సీసీఐ నిబంధనల ప్రకారం కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
News October 27, 2025
రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో రేపు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే వీటిపై ఈ సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. రేపటి భేటీలో మరింత స్పష్టత రానుంది. డిసెంబర్ 31వ తేదీ లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నవంబర్ 7వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


