News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 28, 2025

విశాఖ: అన్నయ్య మందలించడంతో సూసైడ్

image

అన్నయ్య మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జై భారత్ నగర్‌లో ప్రతాప్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రతాప్ శుక్రవారం డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన అన్నయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News March 28, 2025

కార్యకర్తలకు హ్యాట్సాఫ్: YS జగన్

image

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో CBN అధికార అహంకారాన్ని బేఖాతరు చేస్తూ MPTCలు, ZPTCలు YCP అభ్యర్థులను గెలిపించుకున్నారని YS జగన్ కొనియాడారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టిన వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో వారు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు.

News March 28, 2025

మద్యం తాగేటప్పుడు చికెన్ తింటున్నారా?

image

చాలామంది మద్యం తాగేటప్పుడు స్టఫ్‌లో చికెన్ తినడానికి ఇష్టపడతారు. అలా అయితేనే ‘కిక్కు’ అంటారు. కానీ చికెన్‌లో అధికంగా ఉండే కొవ్వు.. ఆల్కహాల్‌తో కలిసి జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఫ్యాటీలివర్‌కు దారి తీస్తుంది. ఆల్కహాల్‌తో కొవ్వు ఆహారం తీసుకునేవారిలో 30% మందికి కాలేయ సమస్యలు వచ్చినట్లు ఓ అధ్యయనంలో తేలింది. తక్కువ మసాలా, నూనె లేని గ్రిల్డ్ చికెన్ 100-150 గ్రా. తీసుకోవడం ఉత్తమం.

error: Content is protected !!