News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఏనుగు

image

MPలోని పన్నా టైగర్ రిజర్వులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 57 ఏళ్ల అనార్కలి అనే ఏనుగు కవలలకు జన్మనివ్వడంతో అడవి సిబ్బంది, వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏనుగు ఒక్క పిల్లకే జన్మనిస్తుంది. కానీ పన్నా చరిత్రలో తొలిసారిగా 3 గంటల వ్యవధిలో 2 పిల్లలు పుట్టాయి. దీంతో ఈ టైగర్ రిజర్వులో ఏనుగుల సంఖ్య 21కు చేరింది. గత 39 ఏళ్లలో పన్నాలో ఈ ఏనుగు ఇప్పటివరకు ఆరు సార్లు ప్రసవించింది.

News November 23, 2025

డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ

image

IND, SA మధ్య ఈనెల 30 నుంచి 3 మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. చివరి వన్డేను విశాఖలోని ACA-VDCA స్టేడియంలో ఆడనున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం AP క్రికెట్ ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ మ్యాచు టికెట్లు NOV 28 నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య ఉంటుంది.

News November 23, 2025

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా?

image

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ‘సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు స్త్రీల ఉదర భాగం నేలకు తాకుతుంది. ఆ ప్రదేశంలో గర్భకోశం ఉంటుంది. కాబట్టి గర్భకోశానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే స్త్రీలు అలా చేయకూడదు. బదులుగా మోకాళ్లపై కూర్చొని, తలను వంచి సాదర నమస్కారం చేయవచ్చు. అలాగే నడుము వంచి కూడా ప్రార్థించవచ్చు. సాష్టాంగ నమస్కారం పురుషులకు మాత్రమే’ అని చెబుతున్నారు.