News February 12, 2025

బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి

image

బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.

Similar News

News December 10, 2025

MDK: ఓటర్ లిస్ట్.. చెక్ చేసుకోండి ఇలా!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ జిల్లాల్లో ప్రతి మండలానికి సంబంధించి గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లిష్ ఫార్మాట్లలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంది. గ్రామం, వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెలుసుకోవడానికి https://finalgprolls.tsec.gov.in వెబ్‌సైట్ పై క్లిక్ చేయండి. జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. వివరాలు కనిపిస్తాయి.

News December 10, 2025

గ్రేటర్ వరంగల్‌లో డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు!

image

గ్రేటర్ వరంగల్ సమీప ప్రాంతాలు మరోసారి విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 డివిజన్‌లను పెంచాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మడికొండ, రాంపూర్ దాటిన నగరం పెండ్యాల వరకు పెంచాల్సి వస్తోంది. దీంతో పాటు గీసుగొండ, దామెర, ఎల్కతుర్తి, ఐనవోలు వరకు విస్తరణ ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విలీన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

News December 10, 2025

టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

image

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.