News February 12, 2025
బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి

బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.
Similar News
News March 15, 2025
NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30న సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
News March 15, 2025
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.