News February 4, 2025
బాసర: ఒకేరోజు 5721 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని భారీగా అక్షరాభ్యాస పూజలు నమోదయ్యాయి. మొత్తం 5721 మంది చిన్నారులు అక్షర శ్రీకారం జరిపించుకున్నారు. రూ.1000 టికెట్‌తో 3320 మంది, రూ.150 టికెట్‌తో 2404 చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. వివిధ పూజ టికెట్ల విక్రయాలతో ఒక్కరోజే రూ.58 లక్షల ఆదాయం సమకూరింది.
Similar News
News January 21, 2026
విజయ్-రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు!

విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. విజయ్-రష్మికకు విషెస్ చెబుతూ వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు చెప్పారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షించారు. ఇప్పటివరకు పెళ్లిపై రష్మిక, విజయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
News January 21, 2026
నల్గొండ: బకాయిలపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్త్రీనిధి రుణాల్లో పెరిగిన మొండి బకాయిల వసూలుపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. మార్చి 31లోగా 100% రికవరీ లక్ష్యంతో మహిళా సంఘాల సభ్యుల వద్దకు వెళ్లి బకాయిల వసూళ్లు చేపడుతున్నారు. రుణాలు చెల్లించకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వసూలు జరిగితేనే కొత్త లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయగలమని, అందుకే సభ్యులు వారి వాయిదాలు సకాలంలో చెల్లించాలంటున్నారు.
News January 21, 2026
భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు

TG: వనపర్తికి చెందిన ఆంజనేయులు, సరస్వతి (34) HYD బోరబండలో అద్దెకు ఉంటున్నారు. వీరికి 12ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమై గొడవలు జరిగేవి. అటు ఆంజనేయులు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ‘నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నా’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.


