News March 26, 2025
బాసర గోదావరిలో మహిళ మృతి.. వివరాలు ఇవే!

బాసర గోదావరిలో పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతురాలిని ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన అనురాధ (35)గా గుర్తించారు. ఆమెకు భర్త, కుమారుడు, కూతురు ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ప్రభుత్వాసుపత్రి తరలించామన్నారు. మృతురాలి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 2, 2025
కశింకోట: చెరువులో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి

కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామంలో గల చెరువు ఊబిలో కూరుకుపోయి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు (54) కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఊబిలో చిక్కుకొని మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News April 2, 2025
రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

విజయవాడ రైల్వే డివిజన్కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్కు లభించిందని DRM పేర్కొన్నారు.
News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.