News March 1, 2025
బాసర: జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థి కె.వెంకటేశ్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు కలింగ, హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో ఆర్జీయూకేటీ విద్యార్థి వెంకటేశ్ ఎంపికవడంపై వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Similar News
News September 18, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

▶మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వద్దు.. గ్రామం ముద్దు
▶జిల్లాలో పలుచోట్ల యూరియా కోసం రైతుల అవస్థలు
▶SKLM: ఎంపీ నిధులతో ప్రాంతీయ ప్రాంతాల అభివృద్ధి
▶GST 2.0పై మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష
▶బూర్జ: ధర్మల్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలి
▶పొందూరు: ఈ ప్రయాణాలు..ప్రమాదం
▶సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శంకర్
▶రైతు సమస్యలపై సభలో చర్చిస్తాం: అచ్చెన్నాయుడు
News September 18, 2025
డోర్నకల్: అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన డీఎస్ రవిచంద్ర

మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి డీఎస్ రవిచంద్ర గురువారం రాజీనామా చేశారు. తన వ్యక్తిగతమైన కారణాలు, కార్యక్రమాలతో అసోసియేషన్ కోసం అధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నానని, అందువల్లనే మరొకరికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రవిచంద్ర దశాబ్ద కాలానికి పైగా అధ్యక్ష పదవిలో ఏకగ్రీవంగా కొనసాగుతున్నారు.
News September 18, 2025
మంచిర్యాల: సింగరేణిలో ఈపీ ఆపరేటర్లకు శుభవార్త

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు శుభవార్త.. ఎక్స్ కవేషన్ కేటగిరీ- డి నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి, ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-బికి త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 150 మంది ఆపరేటర్లు పదోన్నతి పొందనున్నారు. కేటగిరీ- డిలో రెండేళ్లు, కేటగిరీ- సిలో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.