News February 8, 2025
బాసర ట్రిపుల్ ఐటీలో తప్పులపై అధ్యాయన కమిటీ

బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షా పత్రాల మూల్యంకనం ప్రక్రియపై నిజ నిర్ధారణ కమిటీ నియమించినట్లు యూనివర్సిటీ పరిపాలన అధికారి రణధీర్ తెలిపారు. మూల్యంకనంలో పొరపాట్లతో పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారిని విద్యార్థులు నిలదీసి నిరసన తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కమిటీ వేసినట్లు అధికారులు వివరించారు.
Similar News
News September 19, 2025
సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.
News September 19, 2025
వృద్ధుల సంక్షేమంపై ములుగు ఆర్డీఓ కీలక సూచనలు

వయోవృద్ధులు తమ ఆస్తిని బదలాయించేటప్పుడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ‘పోషణ, సంక్షేమం’ నిబంధనలను తప్పకుండా పొందుపరచాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. ఆస్తి పొందినవారు నిబంధనలు పాటించకపోతే, వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఆస్తిని రద్దు చేసే అధికారం ఉంటుందని తెలిపారు.
News September 19, 2025
మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.